భారత దేశంలో దాదాపు ప్రతి గ్రామంలో ఏదో ఒక దేవాలయం ఉంటుంది. ఒక్కో గుడికి ఒక్కో చరిత్ర ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా అన్ని దేవాలయాల్లో పండ్లు, శాఖాహారాన్నే ప్రసాదంగా పెడతారు. ఎక్కువగా లడ్డూ, పులిహోర, దద్దోజనం వంటి పదార్థాలను ఇస్తారు. కానీ కొన్ని ఆలయాల్లో మాత్రం మాంసాహారాన్ని ప్రసాదంగా పెడతారు. (ప్రతీకాత్మక చిత్రం)
విమల ఆలయం, ఒడిశా: ఈ ఆలయం ఒడిశాలోని పూరిలోని జగన్నాథ ఆలయ సముదాయంలో ఉంది. ఇది శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిస్తారు. దుర్గాపూజ పండుగ సందర్భంగా పవిత్రమైన మార్కండ ఆలయ ట్యాంక్ నుంచి చేపలను పట్టి.. అక్కడే వండుతారు. అనంతరం విమలా దేవికి నైవేద్యంగా పెడతారు. కొందరు మేకలను కూడా బలి ఇస్తారు. జగన్నాథుని ఆలయ ప్రధాన తలుపులు తెరవకముందే ఇదంతా జరుగుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
పరస్సానిక్ కొడవు ఆలయం, కేరళ: ఈ ఆలయం ముత్తప్పన్కి అంకితం చేయబడింది. ముత్తప్పన్ ఆలయాన్ని మహావిష్ణువు, శివుని అవతారంగా భావిస్తారు. ఈ ఆలయంలో కల్లుతో పాటు కాల్చిన చేపలను ముత్తప్పన్కు సమర్పిస్తారు. అలా చేయడం ద్వారా వారి కోరిక నెరవేరుతుందని విశ్వసిస్తారు. ఆలయానికి వచ్చి సందర్శించే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
కామాఖ్య దేవాలయం, అసోం: ఇది భారతదేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి. తాంత్రిక శక్తులను కోరుకునే వారు కామాఖ్య దేవిని పూజిస్తారు. ఇది అసోంలోని నీలాచల్ కొండలలో ఉంది. ఇక్కడ రెండు శాఖాహారం, మాంసాహారంతో చేసిన రెండు రకాల ప్రసాదాలు ఉంటాయి. ఐతే దేనిలోనూ ఉల్లిపాయలు, వెల్లుల్లి వినియోగించరు. మేక మాంసంతో పాటు చేపలతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఆ సమయంలో ఆలయ తలుపులను మూసివేస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)