లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న పురుషుడికి రక్షణ కల్పించాలంటూ పంజాబ్(Punjab) మరియు హర్యాన(Haryana) హైకోర్టు సంచలన తీర్పును వెలువరిచింది. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్(Punjab) రాష్ట్రానికి చెందిన ఓ జంట లివింగ్ రిలేషన్ షిప్(living Relationship) లో ఉన్నారు. ఆ జంటలో యవకుడికి అప్పటికే వివాహం జరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
పిటిషనర్లు లైవ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారని మరియు వారి ప్రాణాలకు మరియు స్వేచ్ఛకు ప్రమాదం ఉందని పిటిషన్ తరఫు న్యాయవాది దినేష్ మహరాజ్ కోర్టులో తెలిపాడు. తమ క్లయింట్ కు ఇప్పటికే పెళ్లి కాగా విడాకుల కోసం అప్లై చేసుకున్నాడని దాదాపు విడాకులు కూడా ఖరారు అయ్యాయని..దాంతో ప్రస్తుతం తనకు నచ్చిన మరో యువతితో రిలేషన్ షిప్ లో ఉన్నాడని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం )