న్యూస్18నెట్వర్క్ న్యూఢిల్లీలో నిర్వహించిన న్యూస్18 రైజింగ్ ఇండియా సమ్మిత్ 2023 తొలిరోజు వివిధ అంశాలపై ప్రముఖులు తమ అభిప్రాయాలు తెలిపారు. ముఖ్యంగా కేంద్ర హోమంత్రి అమిత్షా, విదేశాంగ మంత్రి జైశంకర్, కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. దేశం కోసం వివిధ రంగాల్లో సేవలందించిన రియల్ హీరోస్ని అభినందించారు. (Image: News18)
ఇవాళ ఉదయం 10 గంటలకు రెండోరోజు సదస్సు.. కేంద్ర రక్షణ మంత్రి ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఇవాళ.. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర మంత్రులు అనురాగ్ థాకూర్, భూపేందర్ యాదవ్, హర్దీప్ సింగ్ పురి, పియూష్ గోయల్ సహా సినిమా, క్రీడా ప్రముఖులు పాల్గొంటారు. వ్యవసాయం, హార్ట్ ఎటాక్, మహిళా శకం, మహిళా శక్తి, హంగర్ ఫర్ లెర్నింగ్, భారత తయారీ రంగం, జమ్మూకాశ్మీర్, సరికొత్త భారత్, వన్ ఇండియా వన్ సినిమా వంటి అంశాలపై ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. (Image: News18)