New Year Events : మీరు గమనించే ఉంటారు కరోనాకీ వేడుకలకూ సంబంధం ఉంటుంది. వేడుకలు పెరిగే కొద్దీ కరోనా కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఇండియాలో వ్యాపించిన BF.7 వేరియంట్.. మున్ముందు మరింత వ్యాపిస్తూ కేసుల సంఖ్య పెరుగుతుందనే అంచనా ఉంది. అందువల్ల న్యూఇయర్ వేడుకలపై అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. వేడుకలపై కండీషన్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఆల్రెడీ కర్ణాటక ప్రభుత్వం షరతులు విధించింది. (ప్రతీకాత్మక చిత్రం - image credit - reuters)
మీరు గనుక కొత్త సంవత్సర వేడుకల కోసం అని పార్టీలు, క్లబ్బులు, పబ్బులు, బార్లకు వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేసుకుంటున్నట్లైతే.. దీనిపై ఆలోచించండి. ఒకవేళ కేంద్రం వేడుకల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే.. టికెట్ల మనీ వాపస్ వస్తుందో లేదో ముందే కనుక్కోండి. వాపస్ ఇవ్వరని తెలిస్తే.. బుక్ చేసుకుంటే.. చిక్కుల్లో పడతారు. (ప్రతీకాత్మక చిత్రం)
కేంద్రం అలా చెయ్యదు అని అనుకోవద్దు. ఎందుకంటే.. మొన్నటివరకూ టెస్టులు, థెర్మల్ స్క్రీనింగ్స్ వంటివి పెద్దగా చెయ్యలేదు. అందువల్ల ఇండియాలో కరోనా ఉన్నా అది లెక్కల్లో అంతగా రాలేదు. ఇప్పుడు కచ్చితంగా టెస్టులు చేస్తున్నారు కాబట్టి.. కొత్త కేసుల సంఖ్య జోరుగా ఉంది. అందువల్ల ఇండియాలో కరోనా బాగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితే ఆంక్షలు పెట్టేందుకు వీలు కల్పిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం - image credit - PTI)
విదేశాల నుంచి వచ్చేవారిని టెస్ట్ చేస్తే.. వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ అని తేలుతోంది. వరెస్ట్ సినారియో ఏంటంటే.. వారిలో కరోనా లక్షణాలు కనిపించట్లేదు. సపోజ్ చైనా నుంచి ఓ వ్యక్తి BF.7 వేరియంట్‌తో ఇండియా వస్తే.. అతనికి లక్షణాలు లేవని.. టెస్ట్ చెయ్యకపోతే.. అతని ద్వారా చాలా మందికి ఆ వైరస్ వ్యాపించగలదు. ఇదే కేంద్రాన్ని ఆలోచనలో పడేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం - image credit - Twitter - @kiwitwees)
కరోనా సోకి, లక్షణాలు లేని వారు కూడా న్యూఇయర్ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది. తద్వారా వారి నుంచి ఆ వైరస్ చాలా మందికి వ్యాపించగలదు. ఆ తర్వాత ఒక్కసారిగా కేసులు పెరగగలవు. అది ఫోర్త్ వేవ్‌కి దారితీసే ప్రమాదం ఉంటుంది. అందుకే కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు.. న్యూఇయర్ వేడుకల్ని రద్దు చేయాలనీ లేదా ఆంక్షలు విధించాలని రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
చూస్తుంటే ఈసారి కూడా ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. BF.7 ఇండియాలో అంతగా ప్రభావం చూపదనీ, మరణాలు కూడా చైనా లాగా రావని నిపుణులు అంచనా వేస్తున్నా.. ఎందుకు నిర్లక్ష్యంగా ఉండాలి అని కేంద్రం భావిస్తోంది. పొరపాటున ఫోర్త్ వేవ్ వస్తే చాలా ఇబ్బంది అవుతుందని అంచనా వేస్తోంది. అందుకే రాష్ట్రాలపై తీవ్ర ఒత్తిడి ఉంది. అందువల్ల వేడుకలకు టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకునేవారు.. పరిస్థితులను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మేలు. (ప్రతీకాత్మక చిత్రం)