HOME »
PHOTOGALLERY » CORONAVIRUS-LATEST-NEWS »
NAVRATRI 2020 GO CORONA GO SLOGAN GARBA CAME IN RAJKOT MARKET NK
Go Corona Go: గో కరోనా గో... ఈసారి గుజరాత్ గర్భ నృత్య థీమ్ ఇదే... దృశ్యాల్లో
Garba with the slogan 'Go Corona Go': దేశ ప్రజలు కరోనాపై ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. మరి గర్భ నృత్యంతో ఎలా కరోనాను తరిమేస్తారు? ఆ స్లోగన్ ఎలా ప్రజలను ఆకట్టుకుంటోంది?
News18 Telugu | October 11, 2020, 11:03 AM IST
1/ 4
చాలా ఏళ్ల తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఒకే బాటలోకి వచ్చాయి. యావత్ మానవాళీ... కరోనాను అంతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ పరిస్థితుల్లో... ప్రపంచ ప్రసిద్ధ గుజరాత్ గర్భ నృత్యాలను ఈసారి కరోనాకి వ్యతిరేకంగా నిర్వహించబోతున్నారు. అందుకు తగ్గట్టుగా... గో కరోనా గో అనే నినాదంతో... గర్భ కుండలను తయారుచేస్తున్నారు. కుండలపై నినాదంతోపాటూ... కరోనా చిత్రాలు కూడా వేస్తున్నారు. కుండలను తయారుచేసే పనిలో... కళాకారులు బిజీగా ఉన్నారు.
2/ 4
గర్భ నృత్యంలో గుజరాతీలు... ఓ కుండలో దీపాన్ని ఉంచి... పూజలు చేసి.. దాని చుట్టూ నృత్యం చేస్తారు. ఆ దీపాన్నే దుర్గా మాతగా కొలుస్తారు. విజయదశమితో... తమ కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటారు. అలాగే... పెళ్లైన మహిళలు తాము గర్భం ధరించేలా దీవించాలని అమ్మవారిని కోరుకుంటారు. ఇలా నవరాత్రుల్లో జరిపే గర్భ నృత్యం... గుజరాతీయులకు అత్యంత ప్రముఖమైనదిగా మారింది. నవరాత్రుల కాలంలో... గర్భ కుండను ఇళ్లలో ఉంచి పూజిస్తే... ఇల్లంతా... పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందని భావిస్తారు.
3/ 4
కాలానుగుణంగా... గర్భ కుండలు కూడా తమ ఆకారాన్నీ, రంగులనూ మార్చుకుంటున్నారు. కుండల తయారీలోనూ ఎన్నో మార్పులు వచ్చేశాయి. ఒకప్పుడు మట్టి కుండలు వాడేవారు. వాటికి ఏ రంగులూ ఉండేవి కావు. కొన్నాళ్ల తర్వాత కుండలపై రంగులు వేయడం ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి సరికొత్త రంగుల గర్భలు వచ్చేశాయి. తాజాగా రాజ్‌కోట్‌లో కళాకారులు... గో కరోనా గో కుండలను తయారుచేస్తున్నారు.
4/ 4
ఈ కుండలు కొనేందుకు ప్రజలు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. కరోనాను తరిమేసే ఉద్యమంలో తామూ ఉన్నామని చెప్పేందుకు ఈ కుండలను కొనడాన్ని ఓ రుజువులా వారు భావిస్తున్నారు. విజయదశమి అంటే చెడుపై మంచి విజయం. అందువల్ల ఈ దసరా నుంచి కరోనాకి ఇక బ్రేక్ పడినట్లే అవుతుందనే నమ్మకంతో ఉన్నారు భారతీయులు. ఈ పరిస్థితుల్లో ఈసారి జరిగే గర్భ నృత్యాల్లో కరోనా థీమ్ చాలా రకాలుగా కనిపించే అవకాశాలున్నాయి.