ప్రశాంత్ కిషోర్.. రాజకీయ వ్యూహకర్త. ఈయనకు చెందిన ఐపాక్ సంస్థ చేసే సర్వేలు చాలా వరకూ వాస్తవాలకు దగ్గరగా ఉంటాయనే వాదన ఉంది. అందువల్ల ఎన్నికలకు సంబంధించి పీకే చెప్పే విషయాలు తరచూ వైరల్ అవుతుంటాయి. 2014లో మోదీకి అనుకూలంగా ఉండే పీకే.. 2019లో మోదీకి దూరమయ్యారు. ఐతే.. తాజాగా ఆయన.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు మళ్లీ బీజేపీకే పట్టం కడతారనీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. (images credit - Facbook - Narendramodi and News18)
ప్రస్తుతం రాజకీయాల్లో ప్రత్యక్ష పోరాటం చేస్తూ.. సరికొత్త రాజకీయ వ్యవస్థ కోసం 180 రోజులకు పైగా పాదయాత్ర చేస్తున్న పీకే.. సీనియర్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడినా.. దాని నుంచి కాంగ్రెస్ లబ్ది పొందే అవకాశాలు లేవు అన్నారు. ప్రతిపక్షాలను బలహీన పరిచేందుకు ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయన్న పీకే.. రాహుల్‌పై అనర్హత వేటు ద్వారా కాంగ్రెస్‌కి ఓట్లు వచ్చే అవకాశాలు లేవన్నారు.
ప్రశాంత్ కిషోర్ అంచనాను నమ్మాలా వద్దా అనేది ఎవరి ఇష్టం వారిదే. ప్రస్తుతం 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉండటం, ప్రతిపక్షాల్లో ఐక్యత లేకపోవడం వంటి అంశాలు బీజేపీకి ఇప్పటికీ అనుకూలంగానే ఉన్నాయనేది కొందరు రాజకీయ విశ్లేషకుల మాట. రాహుల్ జైలుకి వెళ్తే.. కాంగ్రెస్ పార్టీలో జోష్ తగ్గిపోయే పరిస్థితి ఉంటుందనీ.. అది బీజేపీకి మరింత కలిసొస్తుందనే అంచనా కూడా ఉంది. ఈ అంశాల వల్ల మళ్లీ బీజేపీ అధికారంలోకి రావచ్చంటున్నారు కొందరు విశ్లేషకులు. (images credit - Facbook - Narendramodi)