అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ క్వాడ్ నేతలతో ప్రత్యక్షంగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడన్, ఆస్ట్రేలియా(Australia) ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ (JApan) ప్రధాని యోషిహిదే సుగాతో కాలిసి భారత ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ మార్చిలో జో బైడన్ వర్చువల్ ఫార్మాట్లో క్వాడ్ లీడర్ల శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు. అనంతర ప్రస్తుతం ప్రత్యేక్షంగా ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది.(Image-Twitter/ANI)
అలాగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఇక, కొవిడ్ మహమ్మారి, తీవ్రవాదం, వాతావరణ మార్పుల వంటి అంతర్జాతీయ సవాళ్ల గురించి ఐరాస ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు చెప్పారు. ఇంకా ఈ పర్యటనలో అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్‌తో చర్చించనున్నారు. ప్రముఖ యూఎస్ కంపెనీల సీఈఐలతో కూడా మోదీ భేటీ కానున్నారు. ఇక, మోదీ సెప్టెంబర్ 26న తిరిగి ఇండియో చేరుకోనున్నారు.(Image-Twitter/ANI)