MUMBAI THANE MUNICIPAL CORPORATION ANNOUNCED NO SALARY FOR EMPLOYES WHO DO NOT TAKE VACCINE AK
No Vaccine No Salary: వ్యాక్సిన్ తీసుకోని వారికి జీతం ఇవ్వబోం.. ఆ కార్పొరేషన్ కీలక నిర్ణయం
వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు అవసరమైతే ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రభుత్వాలు ఇంత చేస్తున్నా.. ఇప్పటికీ కొందరు వ్యాక్సిన్ తీసుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే వంద కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేసింది. ప్రతి ఒక్కరికి ముందుగా ఒక డోసు వ్యాక్సిన్ వేయాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైతం నిర్ణీత గడువులోగా రెండో డోసు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు జిల్లాల కలెక్టర్లతోనే మాట్లాడారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు అవసరమైతే ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రభుత్వాలు ఇంత చేస్తున్నా.. ఇప్పటికీ కొందరు వ్యాక్సిన్ తీసుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఇలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగులకు జీతం ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
మొదటి డోస్ తీసుకోని పౌర ఉద్యోగులకు జీతాలు చెల్లించేది లేదంటూ అందులో పేర్కొంది. అంతేకాదు నిర్ణీత వ్యవధిలోపు రెండోసారి వ్యాక్సిన్ తీసుకోని పౌర ఉద్యోగులకు కూడా జీతాలు అందవని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
పౌర ఉద్యోగులందరూ తమ టీకా సర్టిఫికేట్లను సంబంధిత కార్యాలయాల్లో సమర్పించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ నెలాఖరులోగా నగరంలో వాక్సిన్ వంద శాతం లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)