Amrit Udyan : భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా... ఏడాది పాటూ... ఆజాదీ కా అమృత మహోత్సవం నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందులో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్స్ పేరు మార్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. దానికి అమృత ఉద్యానం (Amrit Udyan) అనే కొత్త పేరు పెట్టారు. అందువల్ల ఇకపై ఈ ఫేమస్ మొఘల్ గార్డెన్స్ని మనం అమృత ఉద్యాన్ అని పిలవాల్సి ఉంటుంది. (image credit - PTI)
తూర్పు లాన్, సెంట్రల్ లాన్, లాంగ్ గార్డెన్, సర్క్యులర్ గార్డెన్ ఇలా కొన్ని ఉన్నాయి. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, శ్రీ రామ్ నాథ్ కోవింద్ హయాంలో మరిన్ని గార్డెన్లను అభివృద్ధి చేశారు. హెర్బల్ 1, హెర్బల్ 2, టాక్టైల్ గార్డెన్, బోన్సాయ్ గార్డెన్, ఆరోగ్య వనం వంటివి వారు ఏర్పాటుచేయించారు. (image credit - PTI)
మార్చి 28 నుంచి 31 వరకూ స్పెషల్ కేటగిరీల కింద ఈ గార్డెన్స్ లోకి అనుమతిస్తారు. అంటే మార్చి 28న రైతుల కోసం, మార్చి 29న దివ్యాంగుల కోసం తెరుస్తారు. అలాగే.. మార్చి 30న రక్షణ దళాలు, పార్లమెంటరీ దళాలు, పోలీసులను అనుమతిస్తారు. మార్చి 31న మహిళల కోసం తెరుస్తారు. వీరిలో ప్రధానంగా గిరిజన మహిళలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారు ఉంటారు.