తనకు పెద్దగా భూమి లేదని, చాలా ఏళ్లుగా ఈ భూమిలో సంప్రదాయ వ్యవసాయం చేస్తున్నానని రైతు కైలాష్ సైనీ తెలిపారు. ఒకరోజు అకస్మాత్తుగా హార్టికల్చర్ సాగు చేయాలనే ఆలోచన అతని మదిలో మెదిలిందట. ఐదేళ్ల క్రితం నాసిక్ నుంచి 50కి పైగా పనస పండ్లను తీసుకువచ్చి వ్యవసాయం ప్రారంభించారు.