Monsoon Rains: వానలే వానలు.. తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు..
Monsoon Rains: వానలే వానలు.. తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు..
Monsoon Rains: వర్షాకాలం వచ్చేసింది. నైరుతి రుతుపవనాలు నేడు కేరళ తీరాన్ని తాకనున్నాయి. మారిన వాతావరణ పరిస్థితుల వలన తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికి తోడు తెలంగాణపై 1.5 కి.మీ. ఎత్తులో గాలుల విచ్ఛిన్నత కొనసాగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
వీటి ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. గురు, శుక్రవారాల్లో నైరుతి, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
బుధవారం హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల, గచ్చిబౌలిలో అత్యధికంగా 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక ఎర్రారం(నల్గొండ)లో 4.4, దండుమైలారం(రంగారెడ్డి)లో 3.8. మాదాపూర్ (హైదరాబాద్)లో 2.6 సె.మీ. వర్షం కురిసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
మరోవైపు ఇవాళ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముంది. నైరుతి రాకతో కేరళలో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి సాధారణ వర్షపాతమే నమోదవుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 5
నైరుతి రుతు పవనాలు ఒకసారి దేశంలోకి ప్రవేశించిన తర్వాత.. 4 నెలల పాటు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మొదట కేరళను తాకి.. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)