సాయంత్రం నాటికి, కోతి మరోసారి విసుగు చెంది షాపు దగ్గరకు చేరుకొని కస్టమర్ చేతిలో నుండి మద్యాన్ని లాక్కొని తాగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు షాపు దగ్గర రచ్చ రచ్చ చేస్తూ నిత్యం మద్యం బాటిల్‌ను కోతి తీసుకెళ్తుందని, ఒక్కోసారి వినియోగదారుడి చేతిలో నుంచి లాక్కెళ్లి పారిపోతుందని చెబుతున్నారు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వాళ్లు పట్టుకుని అడవిలో వదిలేసినా.. మందు తాగకుండా ఈ కోతి ఎన్ని రోజులు ఉంటుందోనని జనం భయపడుతున్నారు.