కరోనా కాలంలో పేదలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో గరీబ్ కల్యాణ్ అన్న యోజనను నవంబరు ఆఖరు వరకు పొడిగించింది. ఈ పథకం కింద ప్రతినెలా ప్రతి ఒక్కరికీ 5 కేజీల బియ్యం లేదా 5 కేజీల గోధుమ పిండి, ఒక్కో కుటుంబానికి 1కేజీ కంది పప్పును ఉచితంగా అందిస్తున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ పథకం ద్వారా దేశంలోని 81 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరనుంది.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన/ఆత్మ నిర్బర్ భారత్ కింద... 24 శాతం ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ (12 శాతం ఎంప్లాయి షేర్, 12 శాతం ఎంప్లాయర్ షేర్)ను మరో మూడు నెలలు పొడిగించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 4,860 కోట్లు కేటాయించింది. ఈ నిర్ణయంతో 72 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. (ప్రతీకాత్మక చిత్రం)