ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన మెడికల్ స్టూడెంట్స్‌కు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. అలా వచ్చిన విద్యార్థులకు భారత మెడికల్ కాలేజీల్లో సర్దుబాటు చేయలేమని కేంద్ర
ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్ట ప్రకారం అందుకు ఎలాంటి నిబంధనలు లేనందున బదిలీ గానీ, సర్దుబాటు గానీ కుదరదని తేల్చిచెప్పింది.(ప్రతీకాత్మక చిత్రం)
ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా తమ చదువులు ఆగిపోయానని.. అక్కడి నుంచి తిరిగొచ్చిన భారత విద్యార్థుల్లో కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇండియాలోనే తమ వైద్యవిద్యను కొనసాగించేలా భారత ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. నేడు సుప్రీంకోర్టులో విచారించగా.. ఆ పిటిషన్లకు సమాధానంగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
ఐనప్పటికీ.. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇండియాకు తిరిగొచ్చిన విద్యార్థులు ఇతర దేశాల్లో ఎంబీబీఎస్‌ను పూర్తిచేసేందుకు అవసరమైన సహకారం అందించేందుకు భారత విదేశాంగశాఖతో నేషనల్ మెడికల్ కమిషన్ సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించింది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 6న తేదీన పబ్లిక్ నోటీస్ జారీ చేసినట్లు తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
భారత్‌లో ఏటా నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించకపోవడం, ఆయా విద్యార్థుల ఆర్థిక స్తోమతను బట్టే విదేశాల్లోకి వెళ్లి వైద్య విద్య అభ్యసిస్తున్నారని ఈ సందర్భంగా కేంద్రం అభిప్రాయపడింది. అలాంటి వారికి ఇక్కడి కాలేజీల్లో అడ్మిషన్ ఇస్తే ఇతర ఇబ్బందులు తలెత్తుతాయని స్పష్టం చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరులో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగడంతో.. ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో అక్కడి కాలేజీల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు తిరిగి స్వదేశానికి వచ్చారు. భారత ప్రభుత్వమే వారిని ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చింది. వారు ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లలేక.. ఇక్కడ చదువుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)