అర్ధరాత్రి వేళ ఓ ఇంట్లో చెలరేగిన మంటల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదంలో 10 అవులు కూడా అగ్ని కీలల్లో చిక్కుకుని మృతిచెందాయి. ఈ విషాద ఘటన హిహచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో చోటుచేసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఈ మేరకు అధికారులు సోమవారం వివరాలు వెల్లడించారు. వివరాలు.. చంబా జిల్లాలోని సుయిలా గ్రామంలోని ఓ ఇంట్లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ వర్షం పడుతున్నప్పటికీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు అదుపులోకి రాలేదు. అర్ధరాత్రి కావడంతో వెంటనే ఎవరూ గుర్తించలేకపోయారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మృతులను దేశ్రాజ్(30), అతని భార్య డోల్కా, వారి ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. వారు పెంచుకుంటున్న 10 అవులు కూడా మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమత్రి జైరామ్ ఠాగూర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల బంధువులకు సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)