Maoist rk: పోలీసుల సంచలన ప్రకటన -అగ్రనేతల మరణాలకు కారణమిదే -తెలంగాణ సరిహద్దులో ఆర్కే అంత్యక్రియలు -photos

Bastar IG P Sundarraj on Maoist rk death : దేశంలో సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాయుధ పోరాటం చేస్తోన్న సీపీఐ (మావోయిస్టు) పార్టీ మరో అగ్రనేత ఆర్కేను కోల్పోయింది. తెలుగువారైన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే అనారోగ్యంతో మృతి చెందినట్లు అధికారికంగా ధృవీకరించిన పార్టీ.. ఆయన అంత్యక్రియల ఫొటోలనూ తాజాగా విడుదల చేసింది. కాగా ఆర్కే మృతిపై బస్తర్ పోలీస్ బాస్ సంచలన ప్రకటన చేశారు..