ఆధునిక భారతదేశంలో పేరెన్నికగల నిర్మాణాలెన్నింటినో రూపొందించిన ప్రముఖ స్ట్రక్చరల్ ఇంజనీర్ మహేంద్ర రాజ్ ఇక లేరు. హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియం సహా ఆయన చేతిలో రూపుదిద్దుకున్న నిర్మాణాలెన్నో ఆయను స్మరించుకుంటోన్న సందర్భమిది..
ఢిల్లీలోని ప్రగతి మైదాన్, హైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియం, అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి భవనాలతో పాటు ఆధునిక భారతదేశంలోని అనేక అధునాతన, ఐకానిక్ భవనాల రూపకర్త, ప్రముఖ స్ట్రక్చరల్ ఇంజనీర్ మహేంద్ర రాజ్ కన్నుమూశారు.
2/ 9
ఢిల్లీలోని తన నివాసంలోనే మహేంద్ర రాజ్ ఆదివారం ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వయసు 97 సంవత్సరాలు.
3/ 9
ప్రఖ్యాత స్ట్రక్చరల్ ఇంజనీర్ మహేంద్ర రాజ్ మృతి పట్ల జాతీయ నేతలు, పలు రాష్ట్రాల అధినేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. స్వాతంత్రభారతంలో ఐకానిక్ నిర్మాణాలు చేపట్టిన ప్రముఖుల్లో ఒక ఇంజనీర్ గా మహేంద్ర రాజ్ అంతటి ప్రాచుర్యం ఎవరికీ లభించలేదు.
4/ 9
ఇంజనీర్ మహేంద్ర రాజ్ అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని లోధి స్మశాన వాటికలో నిర్వహిస్తున్నట్లు మహేంద్ర రాజ్ కుటుంబీకులు వెల్లడించారు.
5/ 9
70వ దశకం నుంచి 80వ దశకం మధ్యలో ఈ దేశంలో నిర్మించిన ప్రముఖ భవనాల్లో మెజారిటీ భవనాలపై మహేంద్ర రాజ్ ముద్ర ఉంటుందని, ఆర్కిటెక్ట్ దృష్టిని భవన రూపంలో ఎలా వ్యక్తీకరించాలో ఆయనకి తెలుసని ప్రముఖ ఆర్కిటెక్ట్ అండ్ అర్బన్ డిజైనర్ కేటీ రవీంద్రన్ అన్నారు.
6/ 9
మహేంద్ర రాజ్ మరణం దేశానికి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ప్రముఖ ఆర్కిటెక్ట్ అండ్ అర్బన్ డిజైనర్ కేటీ రవీంద్రన్ భావోద్వేగానికి లోనయ్యారు.
7/ 9
మహేంద్ర రాజ్, 1946లో లాహోర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి వర్క్స్ డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ అండ్ రోడ్స్‌లో ఉద్యోగంలో చేరారు. అనతి కాలంలోనే చండీగఢ్‌లోని లే కార్బూసియర్ భవనాలపై పని చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయికి ఎదిగారు.
8/ 9
మరిన్ని ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్లి అమ్మన్ విట్నీ కన్సల్టింగ్ ఇంజనీర్స్‌లో 1959 వరకు పనిచేశారు. తిరిగి వచ్చి ముంబైలో మహేంద్ర రాజ్ కన్సల్టెంట్‌ను ప్రారంభించారు. 2002లో ఇంజినీరింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మహేంద్ర రాజ్ పాత్ర కీలకమని చెప్తుంటారు.
9/ 9
మహేంద్ర రాజ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కన్సల్టింగ్ ఇంజనీర్స్‌లో సభ్యుడిగానూ పని చేశారు. మహేంద్ర రాజ్ సేవలకు గాను పలు అవార్డులు గెలుచుకున్నారు.