Ram Mandir: శ్రీరామ మందిరానికే కాదు.. కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి కూడా అదే చెట్టు..!
Ram Mandir: శ్రీరామ మందిరానికే కాదు.. కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి కూడా అదే చెట్టు..!
అయోధ్యలో శ్రీరాముడి భవ్యమైన, దివ్యమైన ఆలయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాముడి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేక ఆలయ నిర్మాణంగా ఉండేలా.. నాలుగు కాలాల పాటు నిలిచిపోయేలా నిర్మిస్తున్నారు. అయితే ఆలయ నిర్మాణంతో పాటు కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి కూడా ఆ చెట్టునే ఉపయోగిస్తున్నారట!
అయోధ్యలో బ్రహ్మాండమైన రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయ గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని పూజించే రోజు కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. (Occasional image)
2/ 8
రామ మందిర నిర్మాణం కోసం మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పండిన నాణ్యమైన కలపను తీసుకొచ్చారు. చంద్రాపూర్ జిల్లాలోని అడవుల నుంచి ప్రీమియం కలపను ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ ద్వారా అందిస్తున్నారు. (Occasional image)
3/ 8
ఈ నెల 29న భారీ ఊరేగింపు ద్వారా మహారాష్ట్ర నుంచి అయోధ్యకు వీటిని తరలించనున్నారు. ఈ చెట్టును ఆలయ ప్రధాన ద్వారం రూపకల్పనలో ఉపయోగిస్తారు. ఆలయాన్ని అలంకరించడానికి అందంగా చెక్కిన కలప అవసరం. 1800 క్యూబిక్ మీటర్ల కలపను తరలిస్తున్నారు. (Occasional image)
4/ 8
అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో నాణ్యమైన సామగ్రిని వినియోగిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన ఇసుకరాయిని నుంచి, శాలిగ్రామ్ రాయిని నేపాల్ నుంచి దిగుమతి చేసుకున్నారు. (Occasional image)
5/ 8
వైభవంతో పాటు, రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శ్రీ రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయ శిల్పకళా నైపుణ్యం, బలంపై మంచి శ్రద్ధ చూపుతోంది. (Occasional image)
6/ 8
శ్రీరామ మందిరమే కాదు, కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి కూడా చంద్రపూర్ చెట్టును వినియోగిస్తున్నారు. ఇది విదర్భ అడవులలో లభించే అధిక నాణ్యత గల చెట్టు. (Occasional image)
7/ 8
మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోలి ప్రాంతాలు దట్టమైన అడవులకు ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ పెరిగే చెట్లను ఉత్తమ నాణ్యత గల చెట్లుగా పరిగణిస్తారు. (Occasional image)
8/ 8
మొత్తమ్మీద మహారాష్ట్రలోని చెట్లు శ్రీరామాలయానికి బ్రహ్మాండమైన శోభను తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. (Occasional image)