మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన పిటిషనర్ దిలీప్ లునావత్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆయన కూతురు పేరు 33 ఏళ్ల స్నేహల్ లూనావత్ నాసిక్‌లోని ఓ వైద్య కళాశాలలో చదువుకుంటోంది. గత ఏడాది జనవరి 28న నాసిక్‌లోని తమ వైద్య కళాశాలలో యాంటీ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా స్నేహల్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంది.(ప్రతీకాత్మక చిత్రం)
కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌కు సంబంధించి అక్టోబర్ 2, 2022న కేంద్రం సమర్పించిన నివేదికపై ఈ పిటిషన్ ఆధారపడింది. తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. వ్యాక్సినేషన్ మొదలైన తొలిరోజుల్లో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొందరు మరణించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
మనదేశంలో మొదట రెండు కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి చేశారు. వీటిలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ఉన్నాయి. కోవిషీల్డ్‌ను సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా, ICMR సంయుక్తంగా భారతదేశంలో అభివృద్ధి చేశాయి. కోవాగ్జిన్‌ను NIV పూణేతో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)