Madhya Pradesh road accident: మధ్యప్రదేశ్లో ఓ జాతీయ రహదారి రక్తమోడింది. భిండ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొని ఏడుగురు మరణించారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఒక మహిళ ఉన్నారు.
మధ్యప్రదేశ్లో ఓ జాతీయ రహదారి రక్తమోడింది. భిండ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొని ఏడుగురు మరణించారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఒక మహిళ ఉన్నారు. (Image:ANI)
2/ 4
భిండ్ జిల్లా బిర్ఖడీ గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో వెళ్తున్న ఓ ట్రక్కు బస్సును ఢీకొట్టింది. ట్రక్ టైర్ పేలడంతో అది అదుపు తప్ప బస్సుపైకి దూసుకెళ్లింది.(Image:ANI)
3/ 4
ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఆరుగురు పురుషులు,ఒక మహిళ ఉన్నారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. (Image:ANI)
4/ 4
ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. (Image:ANI)