LPG Gas Cylinder: రూ.634కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్.. మీరూ కొనండి.. పూర్తి వివరాలు
LPG Gas Cylinder: రూ.634కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్.. మీరూ కొనండి.. పూర్తి వివరాలు
LPG Gas Cylinder: ఎల్పీజీ సిలిండర్ ధర వెయ్యి రూపాయలకు చేరవవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.952గా ఉంది. కానీ మీరు రూ.634కే సిలిండర్‌ను పొందవచ్చు. దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
కాలంతో పాటు గ్యాస్ కంపెనీలు కూడా మారుతున్నాయి. గ్యాస్ సిలిండర్లను సరికొత్తగా డిజైన్ చేస్తున్నాయి. అందులో భాగంగానే కాంపొజిట్ సిలిండర్‌ను తీసుకొచ్చాయి. మనం ప్రస్తుతం వాడుతున్న ఐరన్ సిలిండర్ల కంటే ఇవి చాలా తక్కువ బరువును కలిగి ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
కాంపొజిట్ గ్యాస్ సిలిండర్‌లో 10 కేజీల గ్యాస్ ఉంటుంది. ఇది పారదర్శకంగా ఉంటుంది. లోపల గ్యాస్ ఎంత ఉందో ఈజీగా చూడవచ్చు. ఇప్పుడు వాడుతున్న సిలిండర్ బరువు కంటే దీని బరువు దాదాపు 7 కేజీలు తక్కువగా ఉంటుంది. ఒకచోట నుంచి మరో చోటుకు ఈజీగా తీసుకెళ్లవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
ప్రస్తుతం మనం వినియోగిస్తున్న గ్యాస్ బండలో 14.2 కేజీల గ్యాస్ ఉంటుంది. సిలిండర్ బరువు 17 కిలోల వరకు ఉంటుంది. అంటే మొత్తం బరువు 30కేజీల పైనే ఉంటుంది. కానీ వీటితో పోల్చితే కాంపొజిట్ సిలిండర బరువు తక్కువగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
కాంపొజిట్ సిలిండర్‌లో 10 కేజీల గ్యాస్ ఉంటుంది. సిలిండర్ బరువు కూడా 10 కేజీలు ఉంటుంది. మొత్తం కలిపి నిండు సిలిండర్ బరువు రూ.20 కేజీలు ఉంటుంది. బరువు తక్కువగా ఉండడం వల్ల దీనిని మోసుకెళ్లడం చాలా సులభంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
కాంపొజిట్ సిలిండర్‌ను గ్యాస్ కంపెనీలు స్మార్ట్ సిలిండర్‌గా పిలుస్తున్నారు. తేలికగా ఉన్నప్పటికీ చాలా ధృడంగా ఉంటుంది. దీనిని మూడు లేయర్లతో పటిష్టంగా రూపొందించారు. తుప్పు పట్టదు. లుక్ కూడా ఆకర్షణీయంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
గ్యాస్ కంపెనీలు సాధారణ సిలిండర్‌తో పాటు కాంపొజిట్ సిలిండర్‌ను కూడా విక్రయిస్తున్నారు. ఇండియన్ ఆయిల్ ధరల ప్రకారం.. ఢిల్లీలో దీని ధర రూ.634గా ఉంది. జైపూర్‌లో రూ.637కి అమ్ముతున్నారు. ముంబైలో రూ.634, కోల్‌కతాలో రూ. 652, చెన్నైలో రూ. 645కి అందుబాటులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
ఇక మనం వినియోగించే సిలిండర్లు BIS 3196 ప్రమాణాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. వీటి జీవితకాలం 15 సంవత్సరాలు. వీటిని రెండు సార్లు పరీక్షిస్తారు. మొదటి పరీక్ష 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, రెండవది 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత చేస్తారు.
8/ 9
ఇక లక్నోలో రూ.660, పాట్నాలో రూ.697, ఇండోర్‌లో రూ.653, భోపాల్‌లో రూ.638, గోరఖ్‌పూర్‌లో రూ.677కి కాంపొజిట్ సిలిండర్ అందుబాటులో ఉంది. గ్యాస్ తక్కువగా వినియోగించే చిన్న కుటుంబాలకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
హైదరాబాద్‌లో కాంపొజిట్ సిలిండర్ ధర రూ.670గా ఉంది. హైదరాబాద్‌లో ఇండేన్ గ్యాస్‌కు చెందిన మొత్తం 11 ఏజెన్సీలు ఈ సిలిండర్లను విక్రయిస్తున్నారు. ఆ వివరాలను ఇండియన్ ఆయిల్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)