రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతోన్న దరిమిలా అంతర్జాతీయంగా ముడిచమురు, గ్యాస్ ధర పెరుగుతోంది. దీని ప్రభావం భారత్‌లోనూ కనిపిస్తోంది. అక్టోబర్ 2021 మరియు మార్చి 1, 2022 మధ్య వాణిజ్య సిలిండర్ల ధర రూ. 275 పెరగ్గా, మార్చి 1, 2021-2022 మధ్య దేశీయ ఎల్పిజి సిలిండర్ల ధర రూ. 81 మాత్రమే పెరిగింది. ఇప్పుడు 50 రూపాయలు పెంచిన తర్వాత సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయం.