లోక్ సభ ఎన్నికల చివరి దశలో 7 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో... అంటే ఉత్తరప్రదేశ్-13 సీట్లు, పంజాబ్-13 , పశ్చిమ బెంగాల్-9, బీహార్-8, మధ్యప్రదేశ్-8, హిమాచల్ ప్రదేశ్-4, జార్ఖండ్-3, ఛండీగఢ్-1 స్థానానికి పోలింగ్ జరుగుతోంది.
ఏడో దశలో పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో 918 మంది అభ్యర్థులు పోటిలో ఉన్నారు. ఏడు దశల పోలింగ్‌కు సంబంధించి మే 23న ఫలితాలు రానున్నాయి. ఈలోపు ఏడో దశ పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడవుతాయి.