Election 2019: నిజాయితీ గల నేతలు కనిపించడం లేదు... ఓ జంట వినూత్న ప్రచారం
Election 2019: నిజాయితీ గల నేతలు కనిపించడం లేదు... ఓ జంట వినూత్న ప్రచారం
'Missing Honest Politicians' campaign | నిజాయితీ గల నేతలు కనిపించడం లేదు అంటూ ఓ జంట చేస్తున్న వినూత్న ప్రచారం హైదరాబాద్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల వేళ అభ్యర్థులు తమకు ఓటు వేయాలంటూ ప్రచారంతో హోరెత్తిస్తుంటే... ఈ జంట మాత్రం అసలు నిజాయితీ గల నాయకులు కనిపించట్లేదని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
1/ 11
1. హైదరాబాద్‌కు చెందిన స్వాతి, విజయ్ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో వీరిద్దరూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. 'మిస్సింగ్ హానెస్ట్ పొలిటీషియన్స్' పేరుతో క్యాంపైన్ చేస్తున్నారు.
2/ 11
2. నిజాయితీ గల నాయకులు లేరని, నోటాకు ఓటు వేయాలని అవగాహన పెంచుతున్నారు వీరిద్దరు.
3/ 11
3. నిజాయితీ గల రాజకీయ నాయకులు లేరంటూ చేపట్టిన ఉద్యమం నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది.
4/ 11
4. దేశంలో అందరు రాజకీయ నేతలు నిజాయితీపరులు కాదని చెప్పడం తమ ఉద్దేశం కాదని, ఎలాంటి నేతను ఎన్నుకోవాలో ప్రజల్లో చైతన్యం పెంచడమే తమ లక్ష్యమంటున్నారు వీరిద్దరు.
5/ 11
5. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో స్వయంగా పెయింటింగ్స్ వేసి మరీ అవగాహన కల్పిస్తున్నారు.
6/ 11
6. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రహదారిలో ఈ పెయింటింగ్స్ కనిపిస్తాయి.
7/ 11
7. 'మిస్సింగ్ హానెస్ట్ పొలిటీషియన్స్' క్యాంపైన్ ఇప్పుడు కాదు ఏడాదిగా చేస్తున్నారు.
8/ 11
8. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈ ప్రచారం కొనసాగింది.
9/ 11
9. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఓటర్లలో చైతన్యం కలిగిస్తున్నారు.
10/ 11
10. ఈ జంట చేస్తున్న ప్రచారానికి జనం నుంచి మంచి స్పందన వస్తోంది.
11/ 11
11. తమతమ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం కాలేదని పోరాడుతున్నవారంతా నోటాకు ఓటు వేస్తామని చెబుతుండటం విశేషం.