దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ధరలు చౌకగా మారనున్నాయి. ప్రైవేట్ దుకాణాలు సీసాపై ముద్రించిన గరిష్ట రిటైల్ ధర (MRP)పై 25% వరకు తగ్గింపును ఇవ్వడానికి ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అనుమతించింది. గత ఫిబ్రవరిలో ఢిల్లీ ప్రభుత్వం మద్యం బాటిళ్లపై ఇచ్చే రాయితీని నిషేధించింది. ఆ నిర్ణయాన్ని తాజాగా వెనక్కి తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఐతే తగ్గింపును ఎప్పుడైనా ఉపసంహరించుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని ఎక్సైజ్ కమిషనర్ తరపున ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. "ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎప్పుడైనా డిస్కౌంట్లకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. రాయితీల మంజూరు నిర్ణయాన్ని కొనసాగించడానికి ప్రభుత్వంపై ఎటువంటి ఒత్తిడి ఉండదు" అని పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)