ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే వివాహాలకు చట్టబద్దత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేరళ హైకోర్టు(Kearala High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ పిబి సరేష్ కుమార్(PB Suresh Kumar).. దీనిని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇక, కొద్ది రోజుల కిందట ఓ కేసు విచారణ సందర్భంగా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా వివాహాల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. వరుడు, వధువు ఇద్దరూ ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చి పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వి. రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)