Kerala Rains: కేరళలో వర్ష బీభత్సం.. ఆరుగురు మృతి.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్.. భయానకంగా పరిస్థితులు Photos
Kerala Rains: కేరళలో వర్ష బీభత్సం.. ఆరుగురు మృతి.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్.. భయానకంగా పరిస్థితులు Photos
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి ఆరుగురు మరణించారు. దాదాపు 15 మంది వరకు గల్లంతయ్యారు. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లోని కొండ ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి.
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లోని కొండ ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి ఆరుగురు మరణించారు. దాదాపు 15 మంది వరకు గల్లంతయ్యారు.
2/ 26
కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. అనేక ప్రాంతాలు జలదిగ్భందంలో ఉన్నాయి. కాంజీరపల్లి పట్టణం కూడా ముంపునకు గురైంది. కాంజీరపల్లి పట్టణంలో ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారి. మేరీ క్వీన్స్ హాస్పిటల్ మరియు దాని పరిసరాలు జలమయమయ్యాయి.
3/ 26
రహదారులన్నీ వరదనీటితో నిండిపోయాయి. పలుచోట్ల వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో పలు మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు. విపత్తు నిర్వాహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను రిలీఫ్ క్యాంప్‌లకు తరలిస్తున్నారు.
4/ 26
భారీ వర్షాల నేపథ్యంలో కేరళలోని ఐదు జిల్లాలకు(ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూరు, కొట్టాయం, పతనంతిట్ట) వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో ఏడు జిల్లాలకు అరెంజ్ అలర్ట్, రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
5/ 26
కేరళ విపత్తు నిర్వహణ సంస్థ.. నేవీ సహాయం కోరింది. కొట్టాయంలోని లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న సురక్షిత ప్రాంతాలకు తరలించేందకు సహకారం అందించాలని కోరగా.. సదరన్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో పలు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచారు.