ఈ గజరాజు మస్త్ టాలెంటెడ్..! గోల్‌కీపర్ లాగా బాల్‌ను ఆపుతుంది.. ఫుట్‌బాల్ ప్లేయర్ లాగా బాల్‌ను కిక్చేస్తుంది.. క్రికెట్ కూడా ఆడుతుంది.
2/ 7
మంగళూరులోని ప్రఖ్యాత కటీల్ శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో గజరాణి లీలలు ఒకటి కాదు రెండు కాదు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఏనుగును చూసి ఆనందంతో సెల్ఫీలు దిగుతారు.
3/ 7
క్రికెట్, ఫుట్ బాల్ ఆడే ఈ ఏనుగు ఎవరి హెల్ప్ లేకుండా స్నానం కూడా చేస్తోంది. 1994లో కటీలు ఆలయానికి ఈ ఏనుగును సిబ్బంది తీసుకువచ్చారు. ముద్దుగా మహాలక్ష్మీ అని పేరు కూడా పెట్టారు.
4/ 7
గత ఎనిమిది నెలల నుంచి మహాలక్ష్మీ.. ఈ ఆటలు ఆడుతుందని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. రోజూ ఈ ఏనుగు రెండు గంటలకు పైగా ఫుట్ బాల్, క్రికెట్ ఆడుతుందట.
5/ 7
రోజూ దేవుడి విగ్రహం ముందుకు వచ్చి గంట కొట్టి ప్రార్థన కూడా చేస్తుందట.
6/ 7
గతంలో కటీల్ ఆలయంలో నాగరాజ అనే మగ ఏనుగు ఉండేది. నాగరాజు మరణానంతరం మహాలక్ష్మి వచ్చింది. ఫైరోజ్, అల్తాప్, ముజాహిద్ అనే ముగ్గురు యువకులు.. ఈ ఏనుగును సంరక్షిస్తూ, ఆటలు నేర్పిస్తున్నారు.
7/ 7
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, కటీల్ రథ వీధిలో ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నమస్కరిస్తుంది.