తాజాగా జమ్ముకశ్మీర్‌లోని నౌగమ్ సెక్టార్‌లోని కుప్వారాలో నియంత్రణ రేఖను దాటి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సేనలు శనివారం మట్టుబెట్టాయి. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించి కశ్మీర్‌లోకి ప్రవేశిస్తుండగా భారత జవాన్లు మెరుపుదాడిలో వారిని హతమార్చారు. వారి దగ్గరి నుంచి రెండు ఏకే 47 తుపాకులు, ఒక పిస్తోల్, గ్రనేడ్లు, రూ.1.5 లక్షల భారత్, పాక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.