ఓ చిరుత పులి ఇంట్లోకి దూరింది. కుక్కను వెంబడిస్తూ వచ్చిన చిరుత.. ఇంట్లోకి ప్రవేశించింది. ఈ ఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో చోటుచేసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
వివరాలు.. ఉడుపి జిల్లాలోని బ్రహ్మవర్ తాలూకాలోని నైలాడి గ్రామంలో ఓ కుక్కను వెంబడించిన చిరుత ఓ ఇంట్లోకి దూరింది. ఆదివారం ఉదయం పూట ఈ ఘటన జరిగింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
అయితే చిరుత గాండ్రింపులు, పెద్ద పెద్ద శబ్దాలు విని అప్రమత్తమైన ఆ ఇంట్లోని వారు.. వెంటనే బయటకు వచ్చేసి తలుపులు మూసేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఈ ఘటనపై అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు చిరుతను బంధించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
బోన్లో చిరుతను బంధించి.. అక్కడికి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో విడిచి పెట్టినట్టు అధికారులు తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
చిరుతపులిని బోన్లో బంధించడానికి జోనల్ ఫారెస్ట్ అధికారి శంకర్ నారాయణ చిదానందప్ప నేతృత్వంలోని బృందం గంటపాటు ఆపరేషన్ నిర్వహించిందని అటవీ శాఖ వర్గాలు తెలిపాయి. ఇక, కుక్క మాత్రం చిరుత దాడి నుంచి తప్పించుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)