KARNATAKA ELECTIONS:యువసైనికుల చేతిలోనే కర్ణాటక అధికార పీఠం! ఓటరు నమోదు శాతం ఎంత పెరిగిందంటే..
KARNATAKA ELECTIONS:యువసైనికుల చేతిలోనే కర్ణాటక అధికార పీఠం! ఓటరు నమోదు శాతం ఎంత పెరిగిందంటే..
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ECI)ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. కర్ణాటకలో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.
మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
2/ 7
ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 2.6 కోట్లు కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 2.5 కోట్లు. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. నేటి (మార్చి 29) నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎన్నికల కోడ్) అమలు కానుంది.
3/ 7
బెంగళూరు సిటీ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి అనేకల్, బెంగళూరు సౌత్, యశవంతపూర్, దాసరహళ్లి, బ్యాటరాయణపూర్, మహదేవ్పూర్ మరియు యలహంక్. ఈ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో సహా యువ ఓటర్ల సంఖ్య పెరిగింది.
4/ 7
గత యువ ఓటర్లతో పోలిస్తే ఈసారి యువ ఓటర్ల సంఖ్య సగానికిపైగా పెరిగింది.
5/ 7
బెంగళూరు నగర ఎన్నికల జిల్లాలో యువత ఓటరు నమోదులో 49 శాతం పెరుగుదల నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక సమాచారం ఇచ్చింది
6/ 7
బెంగళూరులో గతంలో 54,000 మంది ఉన్న యువ ఓటర్ల సంఖ్య ఇప్పుడు 1.1 లక్షలు దాటిందని బెంగళూరు నగర్ జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంగప్ప తెలిపారు.
7/ 7
ఇక యువతను మైండ్ లో పెట్టుకొనే రాజకీయా పార్టీలు తమదైన శైలిలో హామిల వర్షం కురిపించాయి. కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి వస్తే డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు రూ.3 వేలు అందిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. అలాగే డిప్లొమా చదివి, నిరుద్యోగులుగా ఉన్న యువతకు రూ.1500 అందిస్తామని చెప్పింది.