ఎప్పుడూ రొటీన్ పంటలే వేస్తూ ఉంటే.. జీవితంలో ఎదుగుదల ఉండదు అని భావించిన రైతులు.. జార్ఖండ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు వినడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో లోహర్దగా జిల్లాలో రైతులు.. సంప్రదాయానికి భిన్నంగా... స్ట్రాబెర్రీ, అరుదైన రకం బొప్పాయి సాగు చేపట్టారు. ఉద్యాన వికాస్ యోజన కింద 2019లో స్ట్రాబెర్రీ, బొప్పాయి సాగుతో రైతుల ఆర్థిక పరిస్థితి మారింది. ఇందుకోసం శిక్షణతోపాటు రైతులకు 50 శాతం సబ్సిడీ కూడా ఇస్తున్నారు. (image credit - News18 Hindi)
రైతుల్లో ఒకరైన ఎమ్లీన్ కందుల్నా.. లోహర్దగా జిల్లా నివాసి. ఆమె వ్యవసాయ అధికారుల నుంచి ట్రైనింగ్ తీసుకొని.. విజయాలు సాధిస్తోంది. 2022లో ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఉత్తమ వ్యవసాయ పారిశ్రామికవేత్తగా జాతీయ అవార్డు అందుకుంది. జార్ఖండ్లో ఈ అవార్డ్ అందుకున్న ఏకైక రైతు ఆమె. (image credit - News18 Hindi)
ఉద్యానవన శాఖ.. ప్రతీ సీజన్లో కొంతమంది రైతుల్ని ఎంపిక చేసి... ట్రైనింగ్ ఇచ్చి... 50 శాతం రాయితీని అడ్వాన్స్ ఫార్మింగ్ కోసం ఇస్తోంది. ఏ పంట వెయ్యాలి అనేది అధికారులే నిర్ణయిస్తున్నారు. పొలంలో రకరకాల పరిశోధనలు చేసి.. ఎలా సాగు చెయ్యాలో పూర్తి ట్రైనింగ్ ఇస్తున్నారు. చల్లని వాతావరణం 'స్ట్రాబెర్రీ ఫార్మింగ్'కి సరైనది. జిల్లాలో అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు రైతులు స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. 200 మందికి పైగా రైతులు ఈ సాగులో లాభాలు సంపాదిస్తున్నారు. (image credit - News18 Hindi)