అన్నాడీఎంకే సర్కారు హయాంలో కొందరు గిల్టు నగలు కుదువపెట్టి రుణం తీసుకోగా, మరికొందరు నగలే పెట్టకుండా రుణాలు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఇలాంటి వాటికి బ్యాంకు అధికారులు కొందరు సహకరించి నట్టు తెలుసుకున్నారు. దీంతో మొత్తం వ్యవహారాన్ని ఆడిట్ చేసేందుకు డీఎంకే సర్కారు సిద్ధమైంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని ఆయా జోన్ల అధిపతులకు రాష్ట్ర సహకార శాఖామంత్రి ఐ.పెరియస్వామి ఆదేశించారు. రుణమాఫీ పథకం మార్గదర్శకాలను బ్యాంకులు పాటించాయా లేదా? అనే విషయాన్నీ విచారిచాలన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
తొలి దశలో నగర, జిల్లా సెంట్రల్ సహకార బ్యాంకుల్లోను, రెండో దశలో ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులు, ఇతర సహకార సంఘాల్లో ఈ ఆడిటింగ్ చేయాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఒక సహకార బ్యాంకులో ఆడిటింగ్ చేసిన తర్వాత ఇతర ఉన్నతాధికారులు ఆ బ్యాంకులో తనిఖీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.(ప్రతీకాత్మక చిత్రం)