అత్యంత తక్కువ సమయంలో శుక్ర గ్రహం చెంతకు మిషన్ చేపట్టడం భారత్కు సాధ్యమేనని, ఆ సామర్థ్యం మనకు ఉందని, ఇందుకోసం ఇప్పటికే ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైందని, నిధులు కూడా సమకూరాయని ఇస్రో చీఫ్ తెలిపారు. 2024 చివర్లో శుక్ర గ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపాలని ప్రణాళికలు చేస్తున్నట్లు సోమనాథ్ చెప్పారు.