భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన భూటాన్ శాట్ ఉపగ్రహాన్ని తయారుచేశారు. పిక్సెల్ సంస్థ తయారు చేసిన ఆనంద్ శాట్, ధ్రువ స్పేస్ సంస్థ రూపొందించిన రెండు తైబోల్డ్ శాట్లు, అలాగే అమెరికాకు చెందిన స్పేస్ ఫ్లైట్ సంస్థకు చెందిన నాలుగు అస్ట్రోకాస్ట్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
భూటాన్ 2019లో తన మొదటి ఉపగ్రహం భూటాన్-1ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఇది విద్య ఆధారిత క్యూబ్‌శాట్. ఓషన్‌శాట్ శ్రేణి ఉపగ్రహాలు భూమి పరిశీలన, నీటి వనరుల పర్యవేక్షణ, తుఫానుల అంచనా కోసం వినియోగిస్తున్నారు. మొదటి Oceansat 1999లో భూమి పైన దాదాపు 720 కి.మీ. దూరంలో ఉన్న పోలార్ సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లో ప్రయోగించారు. (ప్రతీకాత్మక చిత్రం)