Corona 3rd Wave: ఆ రాష్ట్రంలో థర్డ్ వేవ్ మొదలైందా? ఎవరూ ఊహించనంతగా పెరిగిన కొత్త కేసులు
Corona 3rd Wave: ఆ రాష్ట్రంలో థర్డ్ వేవ్ మొదలైందా? ఎవరూ ఊహించనంతగా పెరిగిన కొత్త కేసులు
Corona Third Wave: ప్రజలు అజాగ్రత్తగా ఉంటే కరోనా థర్డ్ వేవ్ తప్పదని కొన్ని రోజులుగా నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కేరళలో ఎవరూ ఊహించనంత భారీగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ మూడో దశవ్యాప్తి మొదలయిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కేరళలో బుధవారం నాటి బులెటిన్లో 31,445 కొత్త కేసులు నమోదయ్యాయి. 245 మంది మరణించారు. అక్కడ కోవిడ్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో..ఈ నెంబర్ చూస్తేనే అర్ధమవుతోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 65శాతం ఇక్కడే ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
మే 20 తర్వాత 30,000 మార్కును దాటటం ఇదే తొలిసారి. ఆ రోజు 30,491 కేసులు వచ్చాయి.. కానీ నిన్నటి బులెటిన్లో మాత్రం ఏకంగా 31,445 మందికి కరోనా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
కేరళలో కరోనా పాజిటివిటీ రేటు కూడా 19.3 శాతానికి చేరుకుంది. మంగళవారం ఇది 18.04 శాతంగా ఉంది. అంటే క్రమంగా పెరుగుతోంది అన్న మాట. మనదేశంలో కేరళలోనే కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఇక ఓనం పండగ తర్వాత భారీగా కరోనా కేసులు పెరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
బక్రీద్ తర్వాత కేరళలో కరోనా ఆంక్షలను సడలించారు. అప్పటి నుంచి కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 20వేలు దాటింది. ఓనం పండగ (ఆగస్టు 21) రోజు 17,016 కేసులు నమోదయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఐతే ఓనం పండగ సందర్భంగా మార్కెట్లు జనాలతో కిటకిటలాడాయి. చాలా మంది నిబంధనలను ఉల్లంఘించారు. ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తి మళ్లీ పెరిగిందని నిపుణులు అభిప్రాయపడుతతున్నారు. (image credit - twitter)
6/ 7
కరోనా పాజిటివిటీ రేటు 20శాతం దాటే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో భారీగా కేసులు పెరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. తాజాగా నమోదవుతున్న కేసులను చూస్తుంటే.. కేరళలో కరోనా థర్డ్ వేవ్ మొదలయిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (image credit - twitter)
7/ 7
కేరళలో కరోనా తాజా పరిస్థితిని చూసి మిగతా రాష్ట్రాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. అక్టోబరు, నవంబరులో పండుగలు ఉన్నాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)