అధికారిక ఆర్డర్ ద్వారా ఏదైనా పరీక్ష సమయంలో ఇంటర్నెట్ను నిలిపివేయడం దేశంలో ఇదే మొదటిసారి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. మార్చి 7, 8, 9, 11, 12, 14, 16 తేదీల్లో ఇంటర్నెట్ బంద్ చేయబడుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే సమయం ఉంటుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.(ప్రతీకాత్మక చిత్రం)
ఫోన్ కాల్స్, మెసేజింగ్ సేవలతో పాటు వార్తాపత్రికల సర్క్యులేషన్ మునుపటిలా కొనసాగుతుందని.. కాబట్టి సమాచారం-కమ్యూనికేషన్ లేదా వ్యాప్తిపై ఎటువంటి పరిమితి విధించినట్లు భావించరాదని ఆర్డర్లో పేర్కొంది. ఈ క్రమంలో ఇంటర్నెట్ను నిలిపివేయడానికి గల కారణాన్ని కూడా ప్రభుత్వం వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
పరీక్షల సమయంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఇంటర్నెట్ సర్వీస్, ఇంటర్నెట్ టెలిఫోన్ సేవలను ఉపయోగించవచ్చని నిఘాకు సమాచారం వచ్చింది. కొన్ని సున్నితమైన ప్రదేశాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పరీక్షలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని, చట్టం ప్రకారం ఈ పనిలో నిమగ్నమైన ఏ వ్యక్తికి ఇబ్బంది కలగకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇంటర్నెట్ నిషేధించాలని నిర్ణయించబడింది.(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా మహమ్మారి కారణంగా పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (WBBSE) 2021లో 10, 12వ పరీక్షలను రద్దు చేసింది. కానీ 2020లో 10వ పరీక్ష ప్రారంభమైన వెంటనే కొన్ని ప్రశ్నాపత్రాల చిత్రాలు వాట్సాప్లో ప్రచారంలోకి వచ్చాయి. అయితే పేపర్ లీక్ కాలేదని బోర్డు ఆ తర్వాత ప్రకటించింది. అలాగే 2019లో కూడా బెంగాలీ భాష, మ్యాథ్స్, ఇంగ్లీష్, లైఫ్ సైన్స్ పేపర్లు వాట్సాప్లో లీక్ అయ్యాయి. లీకైన ప్రశ్నపత్రాలు పరీక్ష సమయంలో పంపిణీ చేయబడినవి కాదని బోర్డు స్పష్టం చేయాల్సి వచ్చింది.(ప్రతీకాత్మక చిత్రం)
అంతకుముందు 2021లో, రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS) ప్రిలిమినరీ పరీక్ష సమయంలో, ఇంటర్నెట్ సేవ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మూసివేయబడింది. జైపూర్లో కొంత కాలం పాటు సందేశాలు, సోషల్ మీడియాలను కూడా నిషేధించారు. అయితే ఈ కసరత్తు అధికారిక ఆర్డర్ ద్వారా చేయలేదు. అధికారిక అధికారిక ఉత్తర్వు ద్వారా పరీక్ష సమయంలో ఇంటర్నెట్ సేవ నిలిపివేయబడిన మొదటి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది.(ప్రతీకాత్మక చిత్రం)