ఇందులో భాగంగా నిత్యం ఢిల్లీ నుంచి నెవార్క్‌కు, వారంలో మూడు రోజులు ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు విమానాలు వెళ్లనున్నాయి. అదే విధంగా ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ ఫ్రాన్స్ ఢిల్లీ, బెంగళూరు, ముంబాయిల నుంచి పారిస్‌లకు జూలై 18 నుంచి ఆగస్ట్ 1 వరకు 28 విమానాలను తిప్పనుంది. ఇక భారత్ నుంచి ఎయిర్ ఇండియా అమెరికా, ఫ్రాన్స్‌లకు సర్వీసులను అందించనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
జర్మనీ విషయానికి వస్తే లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం దాదాపు ఖరారైందని.. వారి అభ్యర్థనను ప్రస్తుతం ప్రాసెసింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి అనేక దేశాల నుంచి తమకు అభ్యర్థనలు వస్తున్నాయని.. అయితే తాము ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు హర్దీప్ సింగ్ పురీ తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)