డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ రూపొందించిన INS విక్రాంత్ కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో నిర్మించబడింది. ఇప్పటికే ఇండియన్ నేవీ దగ్గర ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే మరో యుద్ధ విమాన వాహక నౌక ఉంది. ఇప్పటివరకు ఇలా సొంతంగా విమాన వాహక నౌకలు నిర్మించగలిగే సత్తా అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీలకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఇండియా కూడా ఆ దేశాల సరసన చేరడం విశేషం. (Image Credit- ANI)
37,500 టన్నుల బరువున్న ఈ యుద్ధనౌక 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు ఉంటుంది. సముద్ర తలానికి 30 మీటర్ల లోతులో ఉంటుంది. 14 డెక్స్ ఉంటాయి. 2,300 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. 1,700 మంది సిబ్బంది పని చేయవచ్చు. 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. ఒక్కసారి ఇంధనం నింపుకొంటే 7,500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు. అంటే భారత సముద్ర తీరం మొత్తాన్ని రెండుసార్లు చుట్టేయగలదు. (Image Credit- ANI)
దీని నిర్మాణం 2006లో ప్రారంభమైంది. ఈ నౌకలో 18 అంతస్తుల బిల్డింగ్ ఉంది. మిగ్-29 యుద్ధ విమానాలు, కమోవ్-31 హెలికాప్టర్లు, ఎంహెచ్-60ఆర్ హెలికాప్టర్లు, తేలికపాటి హెలికాప్టర్లు ఈ యుద్ధనౌకలో పనిచేస్తాయి. 1961 నుండి 1997 వరకు నౌకాదళం నిర్వహిస్తున్న విమాన వాహక నౌక INS విక్రాంత్ పేరు మీదుగా దీనికి ఈ పేరు పెట్టారు. (Image Credit- ANI)