Indian Railways: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. తక్కువ ధరకే ఏసీ కోచ్ టికెట్స్
Indian Railways: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. తక్కువ ధరకే ఏసీ కోచ్ టికెట్స్
Indian Railways:
రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త ఇది. చాలా మంది ఏసీ కోచ్‌లో ప్రయాణించాలని అనుకుంటున్నారు. కానీ టికెట్ ధరలు వేలల్లో ఉంటాయి. అందుకే చాలా మంది సామాన్యులు స్లీపర్ క్లాస్‌లోనే ప్రయాణిస్తున్నారు. ఐతే తక్కువ ధరకే ఏసీ క్లాస్ టికెట్స్ ఇచ్చేందుకు రైల్వేశాఖ ప్లాన్ చేసింది.
సామాన్య ప్రజలకు తక్కువ ధరకే ఏసీ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్‌లో స్పెషల్ ఎకానమీ ఏసీ-3 టైర్ కోచ్‌లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే భావిస్తోంది. వీటి టికెట్ ధరలు ఏసీ-3టైర్ కంటే తక్కువగా.. స్లీపర్ క్లాస్ కంటే కాస్త ఎక్కువగా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
స్పెషల్ ఎకానమీ ఏసీ -3 టైర్ కోచ్‌ల్లో టికెట్ ధరలు సాధారణ ఏసీ-3 టైర్ కంటే 8శాతం తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అలాగే 300 కి.మీ వరకు బేస్ ఛార్జీ రూ.440 ఉంటుందని సమాచారం. ఇది కనీస ధర. అదే 4,951 నుంచి 5,000 కిమీలకు.. గరిష్టంగా రూ.3,065 ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఎక్కువ దూరం ప్రయాణించే వారి కోసమే ఈ ప్రత్యేక కోచ్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కపుర్తల రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 50 ఎకానమీ ఏసీ-3 టైర్ కోచ్‌లను ఇప్పటికే తయారు చేశారు. వీటిని అక్కడి నుంచి వివిధ జోన్లకు తరలిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఈ ఏడాది చివరి కల్లా దాదాపు 800 ఏసీ-3 ఎకనామీ కోచ్‌లు సిద్ధమవుతాయని అధికారులు చెప్పారు. ఇందులో 300 కోచ్‌లు చెన్నైలో, 285 కోచ్‌లు రాయ్‌బరేలీలో, 177 కోచ్‌లు కపుర్తలలో తయారవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఒక రైలులో ఏసీ3 కోచ్‌ల కంటే ఏసీ3 ఏకానమీ కోచ్‌లు 15శాతం ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఒక రైలులో ఏసీ3 కోచ్‌ల్లో 72 బెర్త్‌లు ఉంటాయి. కానీ ఏసీ3 ఎకానమీ కోచ్‌ల్లో 83 బెర్త్‌లు ఉంటాయి. సాధారణ కోచ్‌ల్లో సైడ్ బెర్త్‌లు రెండు మాత్రమే ఉంటే.. ఈ కోచ్‌లు వాటి సంఖ్యను మూడుకు పెంచారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
కాగా, రైల్వేకు ఏసీ3 టికెట్స్ ద్వారానే 7శాతం లాభం వస్తుంది. అర్బన్ రైళ్లలో 63శాతం, సబ్ అర్బన్ రైళ్లలో 40, ఏసీ1లో 24 శాతం, ఏసీ2లో 34 శాతం, స్లీపర్ క్లాస్‌లో 34 శాతం నష్టాలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)