Indian Railways: అలర్ట్... రైల్వే సేవల విషయంలో ఈ ప్రచారం తప్పు అంటున్న PIB Fact Check
Indian Railways: అలర్ట్... రైల్వే సేవల విషయంలో ఈ ప్రచారం తప్పు అంటున్న PIB Fact Check
PIB Fact Check | భారతీయ రైల్వే సేవల గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. వాటిని నమ్మొద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ హెచ్చరిస్తోంది. ఇంతకీ ఆ ప్రచారం ఏంటో, నిజానిజాలేంటో తెలుసుకోండి.
1. కరోనా వైరస్ మహమ్మారి, లాక్డౌన్ కారణంగా భారతీయ రైల్వే 2020 మార్చి 22న రైల్వే సేవల్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దశల వారీగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికీ భారతీయ రైల్వే పూర్తిగా రైళ్లను నడపట్లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. కోవిడ్ 19 కన్నా ముందు నడిచినట్టుగా ప్రస్తుతం రైళ్లు నడవట్లేదు. గతంలో కన్నా తక్కువగానే రైళ్లు నడుస్తున్నాయి. పూర్తి స్థాయిలో రైల్వే సేవలు ఎప్పట్నుంచి అందుబాటులో ఉంటాయో తెలియదు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. కానీ భారతీయ రైల్వే 2021 ఫిబ్రవరి 1 నుంచి పూర్తి స్థాయిలో రైళ్లను నడపనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలతో ఈ ప్రచారం జరుగుతోంది. అన్ని ప్యాసింజర్ రైళ్లు, లోకల్ ట్రైన్స్, ప్రత్యేక రైళ్లు యథాతథంగా నడుస్తాయన్నది ఆ ప్రచారం సారాంశం. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. ఫిబ్రవరి 1 రైల్వే సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయన్న ప్రచారం తప్పు అని కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఈ ప్రచారాన్ని నమ్మకూడదని హెచ్చరిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. పూర్తి స్థాయిలో రైళ్లు నడిపే విషయమై భారతీయ రైల్వే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. భారతీయ రైల్వే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లు, ప్రాంతాల్లో భారతీయ రైల్వే స్పెషల్ ట్రైన్స్‌ని ప్రకటిస్తోంది. అంతే తప్ప పూర్తిస్థాయిలో ప్యాసింజర్, లోకల్, స్పెషల్ ట్రైన్స్ నడిపే విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. ప్రయాణికులు కూడా ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాల కోసం భారతీయ రైల్వేకు చెందిన అధికారిక వెబ్సైట్, ట్విట్టర్ ఫాలో కావాలి. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)