1. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారతీయ రైల్వే సేవలు కొన్ని నెలల పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రైల్వే సేవలు మళ్లీ మొదలైనా ఇంకా పూర్తి స్థాయిలో రైళ్లు నడవట్లేదు. పాక్షికంగానే రైల్వే సేవలు ప్రయాణికులకు అందుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. రైల్వే సేవలు చాలాకాలం నిలిచిపోవడం వల్ల భారతీయ రైల్వే నష్టాలు ఎదుర్కొంటోంది. దీంతో రైల్వే మంత్రిత్వ శాఖ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. నష్టాలు పెరిగిపోవడంతో ఖర్చులు తగ్గించుకోవాలని భారతీయ రైల్వే భావిస్తోంది. రైల్వే ఉద్యోగులకు ఇచ్చే అలవెన్సుల్లో కోత విధించాలని రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోందని వార్తలొస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. ఓవర్ టైమ్ డ్యూటీ, ట్రావెల్ అలవెన్స్లను 50 శాతం తగ్గించే అవకాశం కనిపిస్తోంది. దీనిపై కసరత్తు జరుపుతున్న రైల్వే అధికార యంత్రాంగం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. ఈ ఏడాది ఆగస్టులో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైల్వే ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్ను రైల్వే నిలిపివేయనుందని వార్తలొచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. ఆ తర్వాత భారతీయ రైల్వే ఈ విషయంలో వెనక్కి తగ్గిందని వార్తలొచ్చాయి. ఇలాంటి ప్రతిపాదనలు ఏవీ లేవని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. ఇక ప్రస్తుతం రైల్వే ఉద్యోగులకు ఇచ్చే అలవెన్సుల్ని నిలిపివేస్తారన్న వార్తలొస్తున్నాయి. దీనిపై భారతీయ రైల్వే ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. రైల్వే ఏ నిర్ణయం తీసుకున్నా 13 లక్షల ఉద్యోగులపై ప్రభావం చూపించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)