భారతీయ రైల్వే శాఖ.. తన ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటుంది. రైళ్లలో అందించే ఆహారంపై వచ్చిన ఫిర్యాదులను లెక్కలోకి తీసుకొని కొత్తదనం తెస్తూ ఉంది. ప్రయాణికులకు తిండి, పానీయాల సమస్య తలెత్తకుండా రైల్వే శాఖ చాలా చర్యలు తీసుకుంది. ఐతే.. ప్యాంట్రీ కార్లోని ఉద్యోగులు, ప్రయాణికులు మధ్య వివిధ రకాల ఆహారం, వాటి రేటు గురించి తరచూ వాగ్వాదం జరుగుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు రైల్వేశాఖ తాజా ధరల జాబితాను విడుదల చేసింది. (Image credit - cntraveller/irctc)