EVMs : ఇండియాలో ఎన్నికలు జరిగిన చాలాసార్లు ఓడిన పార్టీలు... ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (EVMs)లో ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తున్నాయి. గెలిచిన పార్టీలు.. ఆ ఆరోపణలను తిప్పికొడుతున్నాయి. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. గెలిచినప్పుడు ఈవీఎంలను సమర్థించిన కొన్ని పార్టీలు.. ఓడినప్పుడు అవే ఈవీఎంలను తప్పుపడుతున్నాయి. ఇండియాలో ఈవీఎంలు వచ్చినప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతూనే ఉంది. అయినా కేంద్రం.. ఈ టెక్నాలజీతోనే ముందుకు వెళ్లేందుకు రెడీ అయ్యింది. (image credit - PIB)
ఇండియాలో 1982లో తొలిసారిగా ఈవీఎంలను పరిచయం చేశారు. అప్పటి నుంచి వీటి వాడకం కంటిన్యూ అవుతోంది. ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ.. ఈవీఎంల రాకతో.. ఇండియాలో ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇదివరకు నాలుగైదు రోజులకు వచ్చే ఫైనల్ ఫలితాలు.. ఇప్పుడు ఒక్కరోజులోనే వస్తున్నాయి. ఓటింగ్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. (image credit - Reuters)
ఈవీఎంల పుణ్యమా అని బ్యాలెట్ పేపర్ వాడకం బాగా తగ్గింది. తద్వారా వృక్షాల నరికివేతకు బ్రేక్ పడింది. ఈవీఎంలను తీసుకెళ్లడం, స్టోర్ చెయ్యడం అన్నీ తేలిగ్గా జరుగుతున్నాయి. ఈవీఎం కారణంగా.. బోగస్ ఓట్లు పడే అవకాశాలు లేవు. ప్రతి ఓటుకూ విలువ వస్తుంది. వీటిని ట్యాంపరింగ్ చేయడం అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. (image credit - news18.com)
కొన్ని ప్రతిపక్షాలు మాత్రం.. ట్యాంపరింగ్, హ్యాకింగ్ జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. తరచూ ఈవీఎంలు మొరాయిస్తున్నాయనీ.. తద్వారా తమ ఓటు నిజంగా పడిందో లేదో అనే అనుమానం ఓటర్లకు కలుగుతోందని అంటున్నాయి. ఈ అనుమానాన్ని నివృత్తి చేసేందుకు ఓటు వేసిన తర్వాత.. వేసినట్లుగా నిర్ధారించే స్లిప్ సిస్టం కూడా తెచ్చారు. (image credit - news18.com)