తూర్పు లడఖ్ సరిహద్దులోని పాంగోంగ్ సరస్సు దగ్గర 2020,మే 5న హింసాత్మక ఘర్షణల తర్వాత సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది. జూన్ 2020లో గాల్వన్ లోయలో జరిగిన భీకర ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలలో మరింత ఉద్రిక్తత ఏర్పడింది. ఈ టెన్షన్ ఇప్పటి వరకు అలాగే ఉంది. అటువంటి పరిస్థితిలో,తాజాగా భారత సైన్యానికి చెందిన సైనికులు క్రికెట్ ఆడుతున్న ఫొటోలు మీలో చాలా ఉత్సాహాన్ని నింపబోతున్నాయి.
తూర్పు లడఖ్‌లోని ఎత్తైన ప్రదేశంలో భారత సైనికులు క్రికెట్ ఆడుతున్న ఫొటోలను విడుదల చేసింది. మే 2020లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన ప్రదేశం ఇదే. చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్‌తో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమావేశం మరియు భారత్- చైనా మధ్య సంబంధాలను "అసాధారణమైనవి"గా అభివర్ణించిన ఒక రోజు తర్వాత ఈ చిత్రాలు విడుదలయ్యాయి.
ఈ క్రికెట్ ఎక్కడ ఆడుతున్నారో ఖచ్చితమైన స్థలం తెలియదు. ఈ స్థలం ఘర్షణ ప్రదేశానికి దూరంగా సృష్టించబడిన బఫర్ జోన్‌కు దూరంగా ఉందని కొన్ని మీడియా నివేదికలలో పేర్కొన్నప్పటికీ. ఇరు దేశాల సైన్యాలు బఫర్ జోన్ నుంచి 1.5 కి.మీ మేర వెనక్కి తగ్గాయి. భారత సైన్యం 700 మీటర్లు వెనక్కి వెళ్లి 700 మీటర్ల వెనుక మొదటి క్యాంపును ఏర్పాటు చేసింది. దాని వెనుక క్యాంప్ 2 మరియు 3 ఉన్నాయి. చైనా సైన్యం కార్యకలాపాలు స్పష్టంగా కనిపించే ప్రదేశాలలో ఇవి ఉన్నాయి.