భారతదేశం వచ్చే ఏడాదికల్లా చైనాను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఈ ఏడాది నవంబర్ 15తో ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కును దాటుతుందని తెలిపింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సోమవారం విడుదల చేసిన ఓ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
అధిక జనాభా దేశాలకు చేటు చేస్తుందా? అలాగైతే మరి చైనా చాలా రంగాల్లో అగ్రగామి ఎలా కాగలిగింది?.. భారత్ లో జనాభా పెరుగుదలకు కారణం ముస్లింలే.. ఉమ్మడి పౌర స్మృతే దీనికి పరిష్కారం!.. ముస్లింల కంటే హిందువుల జనసంఖ్యే పెరుగుతోంది!!.. ఇవీ గడిచిన కొన్ని గంటలుగా విపక్ష పార్టీలు, అధికార బీజేపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు. (ప్రతీకాత్మక చిత్రం)