ఈ భూమిపై కరోనా ఉన్నంత కాలం... మనం మాస్కులు వాడక తప్పదన్నది కఠిన వాస్తవం. ఇండియాలో కరోనా వచ్చి 17 నెలలైంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ కొనసాగుతూ ఉంది. ఈ సంవత్సరం కరోనా వల్ల ఎక్కువ మంది చనిపోయారు. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ కొరతను చూశాం. ఎన్నో విషాదాలు మిగిల్చింది సెకండ్ వేవ్. స్టెరాయిడ్ల వాడకంతో... బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వంటి చిత్రమైన వ్యాధులు కూడా వ్యాపించాయి. సెకండ్ వేవ్ ద్వారా ఎన్నో నేర్చుకున్నాం. ఇక త్వరలోనే థర్డ్ వేవ్ వస్తుందని అంటున్నారు. అది పెద్దగా ఉంటుందా, చిన్నగా ఉంటుందా, పిలలకు సోకుతుందా, వ్యాక్సిన్ వేసుకున్నా సోకుతుందా... ఇలా ఎన్నో డౌట్లు మన ముందు ఉన్నాయి. (image credit - twitter)
17 నెలల అబ్జర్వేషన్లో ఓ విషయం తెలిసింది. మొదటి వేవ్‌కీ, రెండో వేవ్‌కీ మధ్య తేడా 100 నుంచి 120 రోజులు ఉంది. మూడో వేవ్‌కి ఈ గ్యాప్ 200 రోజులకు పెరుగుతోంది. ఫలితంగా అది వచ్చేలోపు వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేసేందుకు వీలు కలుగుతోంది. ఐతే... ప్రపంచవ్యాప్తంగా చూస్తే... వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా కరోనా సోకుతోంది కాబట్టి... సేఫ్ డిస్టాన్స్ పాటించడం, హ్యాండ్ శానిటైజర్ రాసుకోవడం, మాస్క్ ధరించడం వంటివి 2022 డిసెంబర్ 31 వరకూ పాటించక తప్పదు ఉంటున్నారు నిపుణులు. కరోనాకు దొరకకుండా ఉండేందుకు ఇంతకు మించిన మార్గం లేదు అంటున్నారు. (image credit - twitter - reuters)
ప్రస్తుతం 135కి పైగా దేశాల్లో డెల్టా వేరియంట్ ఉంది. ఇది ఇండొనేషియా, ఇరాన్ లాంటి దేశాల్లో మరణాల సంఖ్యను బాగా పెంచింది. అమెరికాలో డైలీ కొత్త కేసులు లక్షన్నరకు చేరుతున్నాయి. అన్నింటికీ కారణ డెల్టా వేరియంటే. ఇండియా ఆల్రెడీ దీన్ని ఎదుర్కొని నిలబడింది. అందువల్ల డెల్టా వేరియంట్‌ను తట్టుకొనే స్థాయికి భారతీయులు చేరారు. అలాగని ఇక మనకు కరోనా రాదులే అనుకోవడానికి లేదు. డెల్టా కంటే 60 శాతం ఎక్కువ ప్రమాదకరంగా ఉన్న డెల్టా ప్లస్... ఇండియాలోనూ ఉంది. దాన్ని... వ్యాక్సిన్లు కూడా ఆపలేకపోతున్నాయి. కాబట్టి.. అది విజృంభించకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనదే అంటున్నారు నిపుణులు. (image credit - twitter)
మొదటి, రెండో వేవ్‌లతో డాక్టర్లు కరోనా వైరస్ ఎలాంటిదో చాలా వరకూ తెలిసింది. అందువల్ల థర్డ్ వేవ్‌లో దాన్ని ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతున్నారు. ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నారు. మాస్క్ పెట్టుకోవడం ఇబ్బందే అయినప్పటికీ... కరోనా పూర్తిగా తగ్గలేదు కాబట్టి... మాస్క్ వాడాల్సిందే అంటున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా... కరోనా పూర్తిగా ఎప్పటికి పోతుంది అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. (image credit - twitter)