India Corona bulletin: భారత్‌లో కరోనా మహమ్మారి మళ్లీ భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. కొత్త కేసులు అమాంతం పెరిగాయి. నాలుగు రోజుల్లోనే రెట్టింపు అయ్యాయి. మరి ఇవాళ్టి బులెటిన్‌లో ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.
India Corona cases: భారత్‌లో కరోనా కేసులు ఊహించనంతగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో 13,154 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కోవిడ్ నుంచి కొత్తగా 7,486 మంది కోలుకున్నారు. 268 మరణాలు నమోదయ్యాయి. రెండు రోజులుగా కొత్త కేసుల సంఖ్య 10వేల పైనే నమోదవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,48,22,040కి చేరింది. భారత్‌లో ఇప్పటి వరకు 3,42,58,778 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,80,860 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 82,402 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
ప్రస్తుతం మన దేశంలో టెస్ట్ పాజిటివిటీ రేటు 1.10 శాతంగా నమోదయింది. చాలా రోజుల తర్వాత 1 కంటే ఎక్కవ నమోదయింది. డైలీ పాజిటివిటీ రేటు గత 87 రోజులుగా 2 శాతం లోపు వస్తోంది. ఇక వీక్లీ పాజిటీవిటీ రేటు 46 రోజులుగా 1 శాతం లోపే నమోదవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
కొత్త కరోనా కేసుల్లో మహారాష్ట్ర టాప్‌లోకి దూసుకొచ్చింది. మహారాష్ట్రలో నిన్న 3,900 కేసులు వచ్చాయి. 1,486 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 20 మంది మరణించారు. మహారాష్ట్రలో కోవిడ్ కేసులు అమాంతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
మహారాష్ట్ర తర్వాత కేరళ రెండో స్థానంలో ఉంది. కేరళలో నిన్న 2,846 కొత్త కేసులు వచ్చాయి. 2,576 మంది కొత్తగా కోలుకున్నారు. నిన్న 211 మరణాలు నమోదయ్యాయి. ఇందులో బ్యాక్ లాక్ మరణాలే ఎక్కువగా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
భారత్‌లో నిన్న 11.99 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. నిన్న దేశవ్యాప్తంగా 67.64 లక్షల మందికి కరోనా టీకాలు వేశారు. ఇప్పటివరకు 143.83 కోట్లకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
భారత్‌లో నాలుగు రోజుల్లోనే రోజువారీ కేసలు రెట్టింపయ్యాయి. డిసెంబరు 26 బులెటిన్‌లో 6,987 కేసులు రాగా.. ఇవాళ్టి బులెటిన్‌లో ఏకంగా 13,154 కేసులు నమోదవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
8/ 10
మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 961 కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో ఇప్పటి వరకు 320 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ఎవరూ మరణించలేదు. ఢిల్లీ, మహారాష్ట్రలో ఎక్కువ మంది బాధితులున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)