ఇండియాలో తాజాగా గత 24 గంటల్లో కొత్త కేసులు 1,590 నమోదయ్యాయి. (ఇవి శుక్రవారం రోజంతా నమోదైన కేసులు). 146 రోజుల్లో అత్యధికంగా నమోదైనది నిన్నే అని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ తెలుపుతోంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 910 మంది మాత్రమే రికవరీ అయ్యారు. అంటే.. రికవరీ కేసుల కంటే.. కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దానర్థం.. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లే. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 8,601గా ఉంది.