భారత్ లో తొలిసారిగా ప్రైవేటు రైలు(Private Train)సర్వీస్ ప్రారంభమైంది. భారత్ గౌరవ్ పథకం(Bharat Gaurav Scheme)కింద ప్రైవేటు రైళ్లను నడుపనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి ప్రైవేటు రైలు సర్వీసు దేఖో అప్నా దేశ్ పేరుతో మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రంలోని కోయంబత్తూరు నార్త్ నుంచి మహారాష్ట్రలోని షిరిడీ సాయినగర్‌కు బయల్దేరింది. గురువారం ఉదయం 7.25 గంటలకు ఈ రైలు షిరిడీ చేరనుంది.